ముంబై డాన్.. ఆఫ్రికాలో అరెస్ట్

ముంబై డాన్.. ఆఫ్రికాలో అరెస్ట్

బెంగళూరు:కొన్నేళ్ల పాటు పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన నేరగాడు రవి పుజారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.పశ్చిమ ఆఫ్రికా, సెనెగల్లో కర్ణాటక పోలీసుల బృందం అతన్ని ఆదివారం అరెస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా సోమవారం బెంగళూరుకు తీసుకువచ్చారు. రవికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.కర్ణాటక, ముంబై, గుజరాత్ రాష్ట్రాల్లో వివిధ అక్రమాలు చేసిన రవి గత 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సినీ, రాజకీయ ప్రముఖులకు బెదిరింపులతో పాటు పలు హత్య, భూ కబ్జా లకు పాల్పడ్డాడు.నకిలీ పాస్ పోర్టుతో సెనెగల్ చేరిన రవిని అక్కడ పోలీసులు అరెస్టు చేసి చెరసాల్లో బంధించారు. అతణ్ని తమకు అప్పగిం చా లన్న భారత విన్నపాన్ని సెనెగల్ కోర్టు అంగీకరించడంతో బెంగళూరుకు తరలించారు.జాతీయ దర్యాప్తు సంస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వె స్టి గేషన్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ల సహకారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.నవీ ముంబైలోని జైల్లో శిక్ష అనుభ విస్తున్న చోటా రాజన్ మార్గ నిర్దేశకంలో రవి పుజారి తొమ్మిదో దశకంలో నేరాలకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos