పీటీఐ పై కేంద్రంకన్నెర్ర

పీటీఐ పై  కేంద్రంకన్నెర్ర

న్యూ ఢిల్లీ : ప్రముఖ వార్తా సంస్థ ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ (పీటీఐ) జాతి వ్యతిరేక పాత్రికేయం చేస్తోందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార భారతి ఆరోపించింది. ఆ సంస్థతో సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించింది. చైనా రాయబారి సున్ వీడోంగ్ ఇంటర్వ్యూను పీటీఐ ప్రచురించటమే దీనికి కారణం. జూన్ 15 రాత్రి జరిగిన భారత-చైనా సైనికుల ఘర్షణకు, 20 మంది భారత సైనికులు అమరులు కావడానికి కారణం భారత దేశమేనని వీడోంగ్ ఆరోపించారు. పీటీఐ దేశానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని ప్రసార భారతి అసంతృప్తి వ్యక్తం చేసి పీటీఐకి లేఖ రాసింది. పీటీఐ సంపాదకీయ వైఖరి, ఆ సంస్థతో సంబంధాలను కొనసాగించేందుకు సమర్థనీయంగా లేదని పేర్కొంది. ప్రసార భారతి అనేక దశాబ్దాలుగా పీటీఐకి మద్దతుగా నిలుస్తోంది. రూ.కోట్లాది అందజేస్తోంది. ఈ ఒక్క సంఘటన మాత్రమే కాకుండా, పీటీఐ పని తీరే ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోందని తెలుస్తోంది. పీటీఐతో తెగదెంపుల గురించి త్వరలోనే ప్రసార భారతి ప్రకటించబోతోందని మరొక వార్తా సంస్థ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos