కరాచీ బేకరికీ తప్పని వ్యతిరేకత…

గతవారం పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు,పాకిస్థాన్‌తో పాటు కశ్మీరీలపై కూడా ఆగ్రహావేశాలు,వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి.దీంతో పలు రాష్ట్రాల్లో కశ్మీరీలు ఎప్పుడు ఏంజరుగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.కొన్ని రాష్ట్రాల్లో కశ్మీరీలకు ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులు ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కశ్మీరలను ఇళ్లు ఖాళీ చేయించగా మరికొన్ని రాష్ట్రాల్లో కశ్మీరీలపై స్థానికులు భౌతికదాడులకు సైతం పాల్పడుతున్నారు.
తాజాగా బెంగళూరు నగరంలో కూడా కశ్మీరీలను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నిరసనలు, హెచ్చరికలు చేసారు.కర్ణాటక రాష్ట్రరాజధాని బెంగళూరు నగరంలోని కరాచి బేకరి వద్ద ఆందోళన చేసిన నిరసనకారులు బేకరీపై ఏర్పాటు చేసిన కరాచీ పేరును మూసివేయించారు.కరాచీ బేకరీ శత్రుదేశమైన పాకిస్థాన్‌కు చెందినది కావడంతోనే నిరసన చేసామని చెప్పుకొచ్చారు. పూణెలో కొంతమంది యువకులు కశ్మీర్‌కు చెందిన పాత్రికేయుడిపై దాడికి పాల్పడ్డారు.పూణెలో ఓ పత్రికలో పాత్రికేయుడిగా విధులు నిర్వర్తిస్తున్న జిబ్రాన్‌ నజీర్‌పై కొంతమంది యువకులు దాడికి పాల్పడ్డారు.శుక్రవారం రాత్రి విధులు ముగిసిన అనంతరం బైకుపై ఇంటికి వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న తనను వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెనక నుంచి హారన్ కొట్టి పక్కకు జరగాల్సిందిగా చెప్పారని… ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఎలా వెళతారని చెప్పడంతో వాగ్వాదం మొదలైనట్లు నజీర్ చెప్పాడు.తన బైకు నంబర్‌ప్లేటు పరిశీలించిన వ్యక్తులు హిమాచల్‌ ప్రదేశ్‌గా ఉండడాన్ని గుర్తించి అక్కడికే పంపిస్తామంటూ దుర్భాషలాడినట్లు తెలిపాడు.అయితే తను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని కాదని జమ్ము కశ్మీర్‌కు చెందిన వ్యక్తినని చెప్పడంతో ఇద్దరు ఒక్కసారిగా దాడి చేసినట్లు నజీర్ చెప్పాడు. నీ జర్నలిజం అక్కడే చేసుకో కశ్మీర్‌కు పంపిస్తామని దుర్భాషలాడినట్లు నజీర్ వెల్లడించాడు. దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కశ్మీరీలకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల డీజీపీలకు సూచించింది..

.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos