అట్టుడుకుతున్న ఢిల్లీ..

అట్టుడుకుతున్న ఢిల్లీ..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు దేశంలో సృష్టిస్తున్న ప్రకంపనలు తీవ్ర హింసరూపం దాల్చాయి.మొదట ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసనలు,హింస క్రమక్రమంగా దేశం మొత్తం పాకుతూ చివరకు తెలుగు రాష్ట్రాలు,తమిళనాడు వరకు చేరుకున్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీ అయితే రణరంగాన్ని తలపిస్తోంది. ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులుస్థానిక ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఉద్రికత్తకు దారితీసింది. ఆదివారం రాత్రంతా ఉదయం వరకూ నిరసనలు కొనసాగించారు. వీరి ఆందోళనల్లో ఆరు బస్సులునాలుగు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. ఇక హింసకు పాల్పడిన వారు జేఎంఐ యూనివర్సిటీలో దాక్కున్నారని పోలీసులు రావడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. నిరసన తెలిపారు. ఆందోళనలతో ఆగ్నేయ డిల్లీలోని పాఠశాలలను సోమవారం మూసివేశారు.ఇక అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లు ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య మరో రెండుకు పెరిగింది. మొత్తం కాల్పుల్లో ఐదుగురు మరణించారు. బెంగాల్ లో ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీంతో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలు బెంగాల్లోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది.ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని కేసును సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టును కోరారు. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసును విచారణ చేసిన చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే… హింస తగ్గితేనే తాను కేసును విచారణ చేస్తానని చెప్పారు. హక్కుల గురించి న్యాయస్థానంకు తెలుసునని అదే సమయంలో హింసాత్మక వాతావరణంలో తాను కేసును విచారణ చేయాలేనని చెప్పారు. ఈ హింస అంతా తగ్గాలని తగ్గాకే కోర్టు సుమోటోగా స్వీకరిస్తుందని చెప్పారు. హక్కులు శాంతియుత నిరసనలకు న్యాయస్థానం వ్యతిరేకం కాదని జస్టిస్ బోబ్డే చెప్పారు. విద్యార్థులు అయినంత మాత్రాన వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరని చెప్పారు. పరిస్థితులు చల్లబడ్డాకే దీనిపై విచారణ చేపడతామని చెప్పారు.ఇక ఢిల్లీలో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసుల బస్సులకు నిప్పు పెట్టారంటూ ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ వీడియోల్ని బయటకు తీసుకొచ్చారు.ఈ వీడియోలలో ధ్వంసమైన బస్సులకు నిప్పు అంటించేందుకు పోలీసులు పెట్రోల్ ను క్యాన్లతో తీసుకెళుతున్న వైనం కనిపిస్తోంది. బీజేపీ దారుణ రాజకీయాలకు ఈ వీడియోలు.. ఫోటోలే సాక్ష్యమని ఆయన చెబుతున్నారు. తమ మీద వచ్చిన ఆరోపణల్ని ఢిల్లీ పోలీసులు తిప్పి కొడుతున్నారు. నిరసనకారులే బస్సులకు నిప్పు అంటిస్తున్నారని.. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos