స్టాక్ మార్కెట్లకు లాభాల బోణి

స్టాక్ మార్కెట్లకు లాభాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండడం మదుపర్ల విశ్వాసాన్ని పెంచింది. ఉదయం 9:40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,217 పాయింట్లు లాభపడి 28,818 వద్ద, నిఫ్టీ 344 పాయింట్లు ఎగబాకి 8,434 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76 నిలిచింది. ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఓరియెంట్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్ని గడించాయి. ఫ్యూచర్ లైఫ్స్టైల్, బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్, డీసీబీ బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, టీసీఎన్ఎస్ క్లోతింగ్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos