లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్ల తొలి సారిగా గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 50 వేల మార్కును అధిగమించింది. వచ్చే కేంద్ర బడ్జెట్ లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు ఉండబోతున్నాయనే అంచనాలతో విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇందుకు కారణం. చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు కోల్పోయి 49,624కి పడిపోయింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 14,590 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్ (2.72%), బజాజ్ ఆటో (2.71%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.09%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.23%), ఏసియన్ పెయింట్స్ (0.62%)లాభాల్ని గడించాయి. ఓఎన్జీసీ (-4.00%), భారతి ఎయిర్ టెల్ (-2.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.25%), ఎన్టీపీసీ (-2.19%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos