ఆర్బీఐపై ఆశలతో లాభాల

ఆర్బీఐపై ఆశలతో లాభాల

ముంబై: స్టాక్ మార్కె ట్ల వ్యాపారం శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 1,039 పాయింట్లు లాభపడి 30,986 వద్ద, నిఫ్టీ 358 పాయింట్లు ఎగబాకి 8,999 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.30 వద్ద నిలిచింది. కేంద్రం కరోనా నుంచి ప్రజలకు విముక్తికి రూ.1.70లక్షల కోట్ల ఉద్దీపన పథకం ప్రకటించడం మదుపర్ల న్మకాన్ని పెంచింది. వడ్డీ రేట్ల తగ్గింపు, మార్కెట్లో ద్రవ్యలభ్యత పెంచడానికి ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నివారణకు జి-20 దేశాలు 5 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రతిపాదన కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. షిప్పింగ్ కార్పొరేషన్, ఐటీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్ఏఎల్ షేర్లు లాభాల్ని గడించాయి. ఫ్యూచర్ లైఫ్స్టైల్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్యూరెన్స్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos