మార్కెట్లకు స్వల్ప లాభాలు

మార్కెట్లకు స్వల్ప లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్ని గడించాయి. విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో ఊగిసలాడిన సూచీలు ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు రాణించడంతో కాస్త కుదుటపడ్డాయి. కొనుగోళ్ల వల్ల స్వల్ప లాభాల్ని దాఖలు చేసాయి. బిఎస్ఈ మళ్లీ 39 వేల మార్క్ దాటింది. . ఒక దశలో సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా లబ్ధి పొందింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్ల లాభంతో 39,059 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,604 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 70.93గా దాఖలైంది. ఎన్ఎస్ఈలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, ఇన్ఫో సిస్, మారుతి, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లబ్ధి పొందాయి. అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, జీ ఎంటర్టైన్మెంట్స్, వేదాంతా లిమిటెడ్, గ్రాసిమ్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos