హోసూరులో తారాస్థాయికి చేరిన వలస కార్మికుల అగచాట్లు

హోసూరులో తారాస్థాయికి చేరిన వలస కార్మికుల అగచాట్లు

హోసూరులో వలస కార్మికుల అగచాట్లు తారాస్థాయికి చేరింది.హోసూరు ప్రాంతంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న వలస కార్మికులు స్వంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి కోసం అధికారుల కార్యాలయాలచుట్టు తిరుగుతున్నారు.తమిళనాడు రాజ్త్రంలోని పరిశ్రమలలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందన లక్షలాది మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు మూతపడ్డాయి.ఇటుకల బట్టి నుండి పరిశ్రమల వరకు అన్నీ మూతపడడంతో వలస కార్మికులు ఇబ్బంషులు గురైయ్యారు.హోసూరు ప్రాంతంలో వేల పరిశ్రమలలో పనిచేస్తున్న వలస కార్మికులకు ఇబ్బందులు తప్పలేదు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం,పలు స్వచ్చంధ సంస్థల ద్వారా వలస కార్మికులకు నిత్యవసర వస్తువులు దొరికి కొంత ఊరట చెందినా వలస కార్మికులు నివాసముంటున్న అద్దె ఇళ్ల యజమానులు ఇళ్ల అద్దె కోసం వత్తిడి చేయడంతో వలస కార్మికులకు తలనొప్పిగా మారింది.తినడానికి తిండికే ఇబ్బందులు పడుతున్న తరుణంలో అద్దె ఇళ్ల యజమానుల వత్తిడి తట్టుకోలేక స్వంత ఊళ్లకు వెళ్లేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా స్వంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ పాసలకోసం హోసూరులో కార్యాల యాల చుట్టూ తిరుగుతున్నారు. హోసూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి రోజుకు వందల సంఖ్యలో వలస కార్మికులు వచ్చి పడిగాపులు పడుతున్నారు.అధికారులకు హింది భాష రాకపోవడంతో వలస కార్మికుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.అద్దె ఇళ్ల యజమానుల ఇబ్బందులు భరించలేక ఇబ్బందులు పడుతున్నామని తమను స్వంత గ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని వలస కార్మికులు ప్రాధేయపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos