ధనవంతుల కొమ్ము కాస్తున్న మోదీ

గుహవటి :మోదీ ప్రభుత్వం శ్రీమంతులకు అనుకూలమైన విధానాల్ని అమలుచేసి పేదల పొట్టలు కొడుతోందని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. బుధ వారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సలోభలో ప్రసంగించారు. ‘గత రెండు నెలలుగా మూడు లక్షల మందికి పైగా రైతులు ధర్నాలో కూర్చున్నారు. వారంతా ప్రధాని ఉండే ప్రాంతానికి కేవలం నాలుగైదు కి.మీల దూరంలోనే ఉంటున్నారు. ప్రధానికి వారిని కలవడానికి తీరిక దొరకడం లేదు. ఒకసారి వెళ్లి రైతులను కలిస్తే ఏమవు తుంది. చట్టాల వల్ల రైతులకు ఎదురయ్యే సమస్యల గురించి చర్చిస్తే బాగుంటుంది కదా. అప్పడు వారికి లాభం చేకూర్చేలాగే మార్పులు చేస్తే సరిపోతుంది. కానీ ఈ ప్రభు త్వం తీరు చూస్తే ఈ చట్టాలు, పాలసీలు ధనికుల కోసమే అన్నట్లుగా ఉంది’’ అంటూ మండి పడ్డారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ బ్రాండ్ను వాడుకుని డెవలప్మెంట్ పాలసీలు ఏమీ లేకుండానే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్తో పాటు మిత్రపక్ష పార్టీలు అన్నీ కలిసి హక్కులు, సీఏఏ, ఎన్నార్సీ లాంటి అంశాలపై అస్సాంలో ప్రచారం చేపడు తున్నాయి. ఇవన్ని ఇక్కడ చాలా సున్నితమైన అంశాలు’’ అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు వేర్వేరు రోజులలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos