ప్రియా రామన్‌ భాజపాలో చేరిక

ప్రియా రామన్‌ భాజపాలో చేరిక

తిరుపతి : సినీ నటి ప్రియా రామన్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని, అందువల్లే తాను భాజపాలో చేరానని వెల్లడించారు. ప్రజలకు సేవచేయాలనే ఆశయం కూడా తనకుందన్నారు. గత కొన్నేళ్లుగా తనకు ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుతున్నాయన్నారు. వారికి సేవ చేసుకోవడం ద్వారానే వారి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచగలనని ఆమె వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos