తాటాకు చప్పుళ్లకు బెదరను

తాటాకు చప్పుళ్లకు బెదరను

లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా జరుగుతున్న వాస్తవాలను ధైర్యంగా ప్రజలకు వెల్లడిస్తానని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ శుక్రవారం చేసిన ట్వీట్లో కుండ బద్ధలు కొట్టారు. ‘ప్రజా సేవకురాలిగా ఉత్తర ప్రదేశ్ ప్రజలకు వాస్తవాల్ని తెలపటం నా కర్తవ్యం. ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం నా పనికాదు. నన్ను బెదిరించే ప్రయత్నంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమయం వృథా చేస్తోంది. నాపై ఎన్ని చర్యలు తీసుకున్నా నేను నిజాలను ప్రచారం చేస్తూనే ఉంటాను. కొందరు భాజపా నాయకుల మాదిరి వాస్తవాల్ని చెప్పుజాలని ప్రతినిధిని కాదు.ఇందిరాగాంధీ మనవరాలిని’ అన్నారు. కాన్పూర్ ప్రభుత్వ శిశు ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలు కరోనా కు గురయినట్లు ఆదివారం ప్రియాంక ఫేస్బుక్ పేర్కొన్నారు. వారిలో ఇద్దరు గర్భవతులు, ఒకరు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు.దీన్ని రాష్ట్ర బాలల హక్కుల మండలి ఖండించి ప్రియాంకు తాఖీదుల్ని జారీ చేసింది. తప్పుడు ఆరోపణల్ని చేసినందుకు మూడు రోజుల్లోగా బదులివ్వాలని కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos