రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర

రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర

ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా కుట్ర పన్నుతోందని శివసేన సోమవారం ఇక్కడ ఆరోపించింది. ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రం 7:30 గంటల్లోగా అభిప్రాయాన్ని తెలపాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గడువు విధించడం భాజపా కుట్రని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రావత్ దుయ్య బట్టారు. గవర్నర్ ఆహ్వానం పై శివసేన గడువులో గా స్పందించక పోవటమే తరువాయి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచి స్తోందనని మండి పడ్డారు. ‘గవర్నర్ మాకు మరింత సమయం ఇస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభంగా ఉండేది. భాజపాకు 72 గంటల సమయం ఇచ్చారు. మాకు మాత్రం అతి స్వల్ప సమయమే ఇచ్చారు. రాష్ట్రపతి పాలన విధింపునకు భాజపా రచించిన వ్యూహమిద’ని పేర్కొన్నారు.అనివార్యంగా రాష్ట్ర పతి పాలన విధిస్తే రాష్ట్రంలో మళ్లీ ఆరు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. హిందూత్వ రాజకీయాల పేరుతో ఓట ర్లను శివసేన మోసం చేసిందనీ, ‘‘కూటమి ధర్మాన్ని’’ కాల రాసిందని చెబుతూ ఎన్నికల ద్వారా అధికారంలోకి రావచ్చని భాజపా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos