ప్రగ్యా డాన్స్‌ వీడియో వైరల్‌

ప్రగ్యా డాన్స్‌ వీడియో వైరల్‌

న్యూ ఢిల్లీ: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ నర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోపాల్లోని తన నివాసంలో బుధవారం ఇద్దరు యువతుల పెళ్లిళ్లు జరిపించారు. అప్పగింతల సమయంలో అతిథులతో పాటు తానూ పాటలకు కాలు కదిపారు. చిరునవ్వులు చిందించారు. ఈ వీడియోపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోదరి ప్రగ్యా ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడటం చూసినపుడు, ఎవరి సాయం లేకుండానే నడిచినపుడు, ఇదిగో ఇలా డాన్స్ చేసినపుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి మాలేగావ్ కేసు విచారణలో కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు నటించి, బెయిలు మీద బయటకు వస్తారంతే. ఇలాంటి వేడుకల్లో తను ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది’అని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్ బాస్కెట్బాల్ ఆడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రగ్యా నిందితురాలు. అనారోగ్య కారణాలు చూపి కోర్టుకు నేరుగా హాజరుకాలేనని, తన అభ్యర్థనను మన్నించాలని ఆమె విజ్ఞప్తి చేయగా.. సానుకూల స్పందన లభించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos