‘సాధ్వీ ’ నియమావళిని తప్పలేదన్న ఎన్నికల సంఘం

‘సాధ్వీ ’ నియమావళిని తప్పలేదన్న ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: భోపాల్ లోక్సభ నియోజక వర్గం భాజపా అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ తాము విధించిన 72 గంటల ప్రచార నిషేధాన్ని ఉల్లంఘించినట్లు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. సాధ్వి నియమావళిని తు.చ పాటించినట్లు యోగ్యతా పత్రాన్ని ప్రకటిచింది. 72 గంటల మూడు రోజుల ప్రచార నిషేధ వ్యవధిలో ప్రగ్యా సింగ్ ఆలయాలను సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని చేసారని, . తన పోరాటాల కర పత్రాలను కూడా పంచి పెట్టారని ఆ ఫిర్యాదులో తప్పుబట్టారు. ప్రగ్యాసింగ్ ఈ ఆరోపణలను ఖండించారు. తనకు తెలియకుండానే తన గురించి కర పత్రాలు పంచిపెట్టారని వివరించారు. దీంతో ఎన్నికల సంఘం సంతృప్తి చెందింది. ఉగ్రవాద వ్యతిరేక దళం మాజీ అధిపతి దివంగత హేమంత్ కర్కరే, బాబ్రీ మసీదు ధ్వంసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు 72 గంటల పాటు ఆమె ప్రచారం చేయరాదని ఎన్నికల సంఘం ఆంక్షల్ని విధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos