గోపీ కెరీర్‌కు ప్రభాస్ సాయం..

  • In Film
  • October 15, 2019
  • 135 Views
గోపీ కెరీర్‌కు ప్రభాస్ సాయం..

హీరోగా కెరీర్ మొదలుపెట్టి అనంతరం ప్రతినాయక పాత్రలతో మెప్పించి మళ్లీ హీరో వేషాల బాట పట్టిన గోపీచంద్ కెరీర్ మొదట్లో విజయాలతో సవ్యంగానే సాగినా అనంతరం పూర్తిగా గాడి తప్పింది.చాలా కాలంగా సరైన హిట్లు లేక గోపీచంద్ కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తాజాగా విడుదలైన చాణక్య చిత్రం కూడా డిజాస్టర్ జాబితాలో చేరడంతో ఏం చేయాలో పాలుపోక అత్యంత ఆప్త స్నేహితుడైన ప్రభాస్‌ను కలసి బాధ చెప్పుకొన్నాడట.దీంతో తన స్నేహితుడ కెరీర్‌ను సెట్ చేయడానికి ప్రభాస్ సైతం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.గతంలో జిల్ సినిమాతో గోపీచంద్‌కు ఓ మాదిరి హిట్ ఇచ్చిన యూవీ బ్యానర్ నిర్మాతలకు గోపీ కోసం కథ సిద్ధం చేయాలంటూ సూచించినట్లు సమాచారం. దీంతో యూవీ నిర్మాతలు గోపీ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథల వేటలో పడ్డారని సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos