సుజీత్‌కు ప్రభాస్ అభయం..

  • In Film
  • September 5, 2019
  • 98 Views
సుజీత్‌కు ప్రభాస్ అభయం..

గతనెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన సాహో చిత్రం ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాదికి గానూ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వెల్లడించింది.మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ వచ్చినా వరుస సెలవులు,పండుగ కారణంగా సాహో భారీ వసూళ్లు సాధించింది.కాగా రెండో చిత్రమే ప్రభాస్తో రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా హిట్ అయితే తనకు ఎన్నో అవకాశాలు వస్తాయని ఒకవేళ ఫ్లాప్ అయితే తన పరిస్థితి ఏంటి అని సుజిత్.. ప్రభాస్తో అన్నాడట. దీనికి యంగ్ రెబెల్ స్టార్.. ‘సినిమా హిట్ అయితే నువ్వు స్టార్ డైరెక్టర్ అయిపోతావు. ఒకవేళ ఫ్లాప్ అయి నీకు ఆఫర్లు రాకపోతే నేనే మళ్లీ సినిమా చేస్తా’ అని హామీ ఇచ్చాడని సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos