బాహుబలి గుర్రం ఎక్కడుందో తెలుసా?

  • In Film
  • May 7, 2019
  • 410 Views
బాహుబలి గుర్రం ఎక్కడుందో తెలుసా?

సరిగ్గా రెండేళ్ల క్రితం విడుదలైన ప్రభాస్‌ నటించిన బాహుబలి
2 చిత్రం అంతర్జాతీయంగా ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా విశదీకరించాల్సిన
అవసరం లేదు.ప్రభాస్‌తో పాటు బాహుబలి చిత్రంలో నటించిన ప్రతీ నటీనటులకు అంతర్జాతీయ స్థాయిలో
గుర్తింపు లభించింది.చివరకు కుమార వర్మ అనే హాస్యపాత్రను పోషించిన సుబ్బరాజుకు కూడా
జపాన్‌ దేశంలో భారీగా అభిమానగణం ఏర్పడింది.అంతటిస్థాయిలో బాహుబలి సంచలనాలు నమోదు చేసింది.
బాహుబలి చిత్రం విడుదలైన ఇన్ని రోజులకు చిత్రంలో ప్రభాస్‌ వాడిన గుర్రం గురించి ఎంక్వైరీలు
మొదలయ్యాయి.ప్రభాస్‌ వాడిన గుర్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.చివరగా
గుర్రం విజయనగరం జిల్లా అలమండ సంతకు చెందిన శ్రీనివాస రావు అనే వ్యక్తి వద్ద ఉన్నట్లు
తెలిసింది.చిన్నప్పటి నుంచి గుర్రాలంటే మక్కువ పెంచుకున్న శ్రీనివాసరావు రాజస్థాన్.. కర్ణాటక.. కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లి మరీ గుర్రాల్ని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం శ్రీనివాసరాజు వద్ద ఐదు గుర్రాలు ఉన్నాయి. ఆ మధ్యనే ఆయన బాహుబలి చిత్రం లో ప్రభాస్ స్వారీ చేసిన గుర్రాన్ని కొనుగోలు చేశారు. గుర్రాల ధర రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు ఉందని చెప్పే శ్రీనివాసరావు ప్రభాస్ గుర్రాన్ని ఎంత పెట్టి కొన్నారన్న విషయాన్ని మాత్రం చెప్పరు.ప్రతి రోజూ గుర్రాలకు క్యారెట్.. బీట్ రూట్..నల్ల ఉలవలు..నువ్వులతో తయారు చేసిన అరిసెలు.. కర్జూరం.. తాటిబెల్లం.. గోధుమలు.. పచ్చగడ్డిని పెడుతుంటారు. కాల్షియం టానిక్ ఇస్తుంటారని చెబుతారు. రోజు మార్చి రోజు ఈత కొట్టించటంతోపాటు.. వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు చెబుతారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos