జనాభా నియంత్రణ చట్టం చేయాలి

జనాభా నియంత్రణ చట్టం చేయాలి

పాట్నా: జనాభా నియంత్రణ చట్టం చేయాలని ప్రధాని మోదీకి భాజపా శాసనసభ్యుడు నీరజ్ బబ్లు విన్నవించారు. ‘ప్రస్తుత తరుణంలో ఈ చట్టం తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. 2019 ఆగస్టు 15న జరిగిన 73వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఎర్రకోటపై మోదీ ప్రసంగిస్తూ జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదల వల్ల పథకాల రూపకల్పనలో ప్రభుత్వాలకు అతి పెద్ద సవాల్గా మారబోతుంది. భవిష్యత్తు తరాలకు అభివృద్ది ఫలాలను సమృద్దిగా అందించాలంటే జనాభా నియంత్రణ ఎంతో కీలకమని మోదీ తెలిపారు. జనాభా నియంత్రణపై చాలా కాలంగా చాలా డిమాండ్లు వస్తున్నాయి. పొరుగు దేశం చైనా చాలా కాలంగా ‘వన్ ఆర్ నన్’ అనే పాలసీని అమలు చేస్తూ జనాభా పెరుగుదలను నియంత్రించగలిగింది. చైనా తర్వాత అతిపెద్ద జనాభా కలిగి ఉన్న భారత్. అధిక జనాభా వల్ల పలు సమస్యలను ఎదుర్కుంటోందని నిపు ణు లు  చెబుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు సరైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధిక జనాభా పెద్ద సవాల్గా మారిం ద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos