అనవసరంగా నటించా..

  • In Film
  • March 28, 2019
  • 123 Views
అనవసరంగా నటించా..

ఏ చిత్ర పరిశ్రమలోనైనా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్‌స్పాన్‌ చాలా తక్కువ.ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌లో ఆరేడేళ్లు మహా అంటే ఇంకో మూడేళ్లు మాత్రమే హీరోయిన్‌గా కొనసాగలుగుతారు. అటువంటిది ఒకే చిత్రం కోసం రెండేళ్లు కేటాయించడమంటే సాధారణ విషయం కాదు.ఒకవేళ కేటాయించినా కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోతే కలిగే బాధ ఎలా ఉంటుందో యువ హీరోయిన్‌ పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అర్థమవుతుంది.కెరీర్‌ మొదట్లో పూజాహెగ్డేకు అన్ని పరాజాయాలు ఎదురుకావడంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి నిర్ణయించుకొని బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.మొదట్లోనే మొహంజదారో చిత్రంలో హృతిక్‌రోషన్‌తో నటించే అవకాశం రావడంతో బాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోవచ్చనే ఆశతో రెండేళ్లు మొత్తం మొహంజదారో చిత్రానికే కేటాయించింది.ఈ సమయంలో ఇతర పరిశ్రమల నుంచి ఆఫర్లు వచ్చినా మొహంజదారోపై నమ్మకంతో తిరస్కరించింది. తీరా చిత్రం విడుదలయ్యాక అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో తిరిగి దక్షిణాది బాట పట్టింది.ఈ సమయంలో డీజేతో తెలుగు చిత్ర పరిశ్రమ పూజాకు అవకాశం ఇచ్చింది.ఈ చిత్రంతో గ్లామర్‌ గేట్లు ఎత్తేసి తనలోని సరికొత్త పూజాహెగ్డేను తెలుగు తెరకు పరిచయం చేసింది.అంతే డీజే చిత్రం పరాజయమైనా పూజాకు ఒకదాని వెనుక ఒకటి చిత్రాలు క్యూ కట్టాయి.తాజాగా తన సినీ ప్రయాణంపై ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడిన పూజా ఓ నటికి రెండేళ్లనేది చాలా కీలక సమయం. ఆ సమయంలో నేను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. భారీ బడ్జెట్‌ చిత్రం, హృతిక్‌ హీరో, రెహమాన్‌ సంగీతం అని రెండేళ్ల కాల్‌షీట్స్‌ ఇచ్చేశా. కానీ సినిమా ఫ్లాపవడంతో చాలా బాధపడ్డాను. దాంతో జాగ్రత్తగా కథలను ఎంపికచేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అనవసరంగా రెండేళ్లు (మొహెంజొదారోను ఉద్దేశిస్తూ) వృథా చేశాననిపించింది. కంటెంట్‌ లేని సినిమాలు వెంటవెంటనే చేసేసి పాపులర్‌ అయిపోవాలన్న తొందరపాటు నాకొద్దు’ అని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos