పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

చెన్నై: కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతిపాలన విధించాలని ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. బలపరీక్షలో నెగ్గలేక నారాయణస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీతో కలహాలతో మొదలైన వ్యవహారం తర్వాత కాంగ్రెస్లో అంతః కల హాలతో ముదిరింది. రెండింటికి సంబంధంలేనప్పటికీ దీనికి వెనుక బీజేపీ ఉందనే అనుమానాలు ఉన్నాయి. చాలా తెలివిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరచి చివరికి కూలిపోయేలా చేశారని కమలనాథులపై విమర్శలు వస్తున్నాయి. మరో రెండు నెలల్లో ప్రభుత్వం గడువు తీరనుంది. ఈ దశలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన సిఫార్స్ పట్ల పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోవడం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos