పొగతో ఉక్కిరి బిక్కిరి

పొగతో ఉక్కిరి బిక్కిరి

హొసూరు : ఇక్కడి పారిశ్రామిక వాడలో పలు పరిశ్రమలు ఇష్టా రాజ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోర్ణపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన కాస్టింగ్‌ పరిశ్రమ పొగ గొట్టం నుంచి నిత్యం దట్టంగా పొద వెదజల్లుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. పొగ కారణంగా పిల్లలు శ్వాస కోశ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే పిల్లలకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos