దక్షిణాదిన ముగిసిన పోలింగ్

ఢిల్లీ : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా తమిళనాడులో పోలింగ్ జరిగింది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ ముగిసింది. అసోంలో 40 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగ్గా మంగళవారంతో పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్లో మూడో దశ పోలింగ్ జరిగింది. అసోంలో చివరి దశ పోలింగ్లో భారీగా ఓటింగ్ నమోదైంది. నేటితో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ఒక్క పశ్చిమబెంగాల్లో మాత్రం ఎన్నికలు కొనసాగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 దశల్లో పోలింగ్ జరుగుతుండగా మంగళవారంతో మూడు దశలు పూర్తయ్యాయి. ఈ నెల 10, 17, 22, 26, 29 తేదీల్లో మలి విడతల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రాల వారీగా పశ్చిమ బెంగాల్: 77.68, తమిళనాడు : 65.15, కేరళ : 70.16, అసోం : 82.28, పుదుచ్చేరిలో : 78.24 శాతం పోలింగ్ నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos