యశ్ దంపతులపై షికార్లు చేస్తున్న పుకార్లు..

యశ్ దంపతులపై షికార్లు చేస్తున్న పుకార్లు..

కేజీఎప్‌ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ దంపతుల గురించి వినిపిస్తున్న ఓ వార్త కన్నడనాట హాట్‌టాపిక్‌గా మారింది.హీరో యశ్‌ 2016వ సంవత్సరంలో కన్నడ టాప్‌హీరోయిన్‌ రాధికా పండిట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.త్వరలో భార్య రాధికా పండిట్‌ను రాజకీయాల్లో దించడానికి యశ్‌ భావిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలు చందనసీమతో పాటు కన్నడ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జేడీఎస్‌ అధినేత,మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోగా హాసన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ విజయం సాధించాడు.అయితే దేవేగౌడ కోసం ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తానంటూ ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రకటించడంతో హాసన్‌కు ఉపఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీంతో హాసన్‌ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో రాధికా పండిట్‌ను బరిలో దించడానికి యశ్‌ భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి.ఈ వార్తలపై యశ్‌ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బహుభాష నటి,దివంగత నటుడు అంబరీశ్‌ సతీమణి సుమలత అంబరీశ్‌కు మద్దుగా ప్రచారం చేసిన యశ్‌ ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడిన తీరు చూసి రాజకీయ నేతలు సైతం ఆశ్చర్యపోయారు.యశ్‌కు రాజకీయాల్లో రాణించగలిగే సామర్థ్యం,తెలివి ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.యశ్‌ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను ఖండించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos