పోలీసులు అతి..

పోలీసులు అతి..

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి.దీంతో దేశం మొత్తం నిర్మానుష్యంగా మారింది అయితే కొంత మంది మాత్రం ఆదేశాలు పట్టించుకోకుండా రోడ్ల పైకి రావడంతో పోలీసులు రోడ్లపైకి వచ్చిన ప్రజలపై లాఠీలతో ప్రతాపం చూపించారు.బయటకు వచ్చిన కారణం కూడా తెలుసుకోకుండా లాఠీలతో కొట్టడమే పనిగా పెట్టుకున్నారు పోలీసుల లాఠీ దెబ్బలతో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన లాఠీ దాడి మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇంటి దగ్గర ఉన్న కుటుంబసభ్యులను పోలీసులు వచ్చి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబాన్ని ఎస్సై కక్షతోనే దాడి చేశారని చెబుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లిలో ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఉన్న కుటుంభసభ్యులను చూసిన పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పేలోపే లాఠీకి పని చెప్పారు. ముఖ్యంగా ఎస్సై దాడి చేశాడు. తామేమి నిబంధనలు ఉల్లంఘించలేదని.. చెబుతుండగా తనకే ఎదురు సమాధానం చెబుతావా ఎస్సై మరింత ఆగ్రహంతో లాఠీతో తీవ్రంగా కొట్టాడు. తండ్రిపై దాడి చేయడంతో అతడి తనయుడు పోలీసులను ఎదురించాడు. దీంతో తండ్రితోపాటు తనయుడిపై కొట్టాడు. తర్వాత వారి కుటుంబంలోని మహిళలపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు నెమ్మదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పేదలను కొట్టమని జగన్ ఆదేశించారా? అని ప్రశ్నిస్తున్నారు. విధంగా దాడి చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.అయితే ఘటన హోం మంత్రి మేకతోటి సుచరిత దృష్టికి వెళ్లింది. ఘటనపై వివరాలు తెలుసుకుని ఎస్సై తప్పు ఉండడంతో అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిపై కరోనా రిపోర్టును తయారు చేసి, దాన్ని గ్రామ సచివాలయంలో ఇచ్చేందుకు వెళుతున్న వార్డు వలంటీర్లపై పోలీసుల లాఠీలు విరిగాయి. ఘటన రాజమహేంద్రవరంలోని రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. సర్వేను పూర్తి చేసుకున్న వలంటీర్లు వెళుతుండగా, ఏజీఎస్ పోలీస్ ఫోర్స్ వారిని అడ్డుకుని, విషయం చెబుతున్నా వినకుండా, 144 సెక్షన్ అమలులో ఉంటే, గుంపుగా తిరుగుతున్నారని ఆరోపిస్తూ, లాఠీలకు పని చెప్పారు.జరిగిన ఘటనను తీవ్రంగా నిరసించిన వలంటీర్లు, తమ విధులను బహిష్కరించి, ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు వలంటీర్లతో మాట్లాడి, వారిని ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు ఉంటాయని, నగరంలోని ప్రజల సంక్షేమం కోసం సర్వే విధులను ఎప్పటిలానే చేయాలని వారికి సర్ది చెప్పారు. మరోవైపు  లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదన్న కారణంతో బదౌన్ లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో కొందరు యువకులను మోకాళ్లపై కూర్చోబెట్టి నడిపించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీపుపై బ్యాగులు మోస్తూ, మోకాళ్లపై కూర్చుని, మండుతున్న ఎండలో నేలపై చేతులు ఆనిస్తూ, వీరు వెళ్లాల్సి వచ్చింది. వీడియోలో తమ సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని అంగీకరించిన నగర పోలీస్ చీఫ్ ఏకే త్రిపాఠి, తాను క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. వలస కార్మికులను ఇలా నడిపించిన ట్రయినీ కానిస్టేబుల్ ను డిస్మిస్ చేశామని, మరో కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ జరిపిస్తున్నామని అన్నారు. పోలీసులు సంయమనం పాటించి, పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లభించక స్వస్థలాలకు కాలినడకన బయలుదేరిన కూలీలపై అమానుషంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పిన యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు, ఘటనకు కారకులైన వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. మూడు రోజుల క్రితం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పాల ప్యాకెట్ కోసం వెళ్లిన వ్యక్తిపై పోలీసులు లాఠీతో దాడి చేయడంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos