సైకో సాఫ్ట్‌వేర్‌..

సైకో సాఫ్ట్‌వేర్‌..

ఒకరు కాదు ఇద్దరు కాదు ఉద్యోగాల పేరుతో 600 మంది అమ్మాయిల నగ్నచిత్రాలు సేకరించి వాటితో అమ్మాయిలకు చూపి లైంగిక వాంఛలు తీర్చాలంటూ బెదిరిస్తున్న సైకో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.చెన్నై నగరంలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రదీప్‌ భార్యతో కలసి ఉంటున్నాడు. భార్య కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా భార్యాభర్తలకు పనివేళలు వేరు కావడంతో భార్య విధులకు వెళ్లగానే తన పైశాచికాన్ని నిద్రలేపేవాడు.ఆన్‌లైన్‌లో అమ్మాయిల నగ్నచిత్రాలు సేకరించి బెదిరించాలనే ఉద్దేశంతో ఉద్యోగ ప్రకటనల వెబ్‌సైట్‌లో అమ్మాయిల ఫోన్‌ నంబర్లు తీసుకునేవాడు.అనంతరం ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నానని ప్రాథమికంగా మీరు ఎంపికయ్యారని తదుపరి ఇంటర్‌వ్యూ తమ హోటల్ హెచ్ఆర్ అర్చన వాట్సాప్ లో ఇంటర్వ్యూ చేస్తారని నమ్మించేవాడు.కొద్ది సేపటి అనంతరం అర్చనగా పరిచయం  చేసుకొని రిసెప్షనిస్ట్ అంటే అందంగా ఉండాలని వాట్సాప్ లో వాళ్ల ఫోటోలు పంపమని  అడిగేవాడు. వాళ్లు అందంగా ఉంటే..  మీ ఎద భాగం, వెనకభాగం నగ్న చిత్రాలు, వీడియోలు పంపండి అని ,చెప్పేవాడు. ఇలా 16 రాష్ట్రాలకు చెందిన 600మంది యువతులను నుంచి 2వేల నగ్న ఫోటోలను, వీడియోలను సేకరించాడు.తర్వాత వాళ్లని ఫోటోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టేవాడు.  ఇలా ప్రదీప్‌ బారిన పడ్డ మియాపూర్‌కు చెందిన ఓ అమ్మాయి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.నిందితుడు చెన్నైకి చెందిన ప్రదీప్ గా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ లో 2వేల నగ్న చిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి భార్య, ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos