రవిప్రకాశ్‌కు మరోషాక్..

టీవీ9 సంస్థ ఇమేజ్‌ను దెబ్బతీసేలా పలు ఆరోపణలు చేసిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై కఠినంగానే వ్యవహరించడానికి నిర్ణయించుకున్న టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అందులో మొదటి అడుగు వేసింది.రవిప్రకాశ్‌ వినియోగిస్తున్న ఖరీదైన వాహనాలను టీవీ9 సంస్థకు చెందినవని టీవీ9 నుంచి తొలగించినా రవిప్రకాశ్‌ ఇప్పటికీ సదరు వాహనాలనే వినియోగిస్తున్నారని తమ వాహనాలను తిరిగి ఇప్పించాలని కోరుతూ అలంద మీడియా కోర్టును ఆశ్రయించింది.దీంతో రవిప్రకాశ్‌ వినియోగిస్తున్న ఖరీదైన వాహనాలను అలంద మీడియా యాజమాన్యానికి స్వాధీన పరచాలని పోలీసులను ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో రవిప్రకాశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు కార్లను సీజ్ చేశారు.. అనంతరం రవిప్రకాశ్‌ డ్రైవర్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్‌ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌‌ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని..  కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని బెయిల్ ఇవ్వొద్దని న్యాయవాదులు గతంలోనే కోరిన సంగతి తెలిసిందే.రవిప్రకాశ్‌పై దాఖలైన ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos