రేపోమాపో రవిప్రకాశ్ ఖేల్ ఖతం..

రేపోమాపో రవిప్రకాశ్ ఖేల్ ఖతం..

గత ఏడాది వరకు మీడియాలో ఒక వెలుగు వెలిగిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.నిధుల మళ్లింపు,సంతకాల ఫోర్జరీ,లోగోల అక్రమ విక్రయం కేసుల్లో పోలీసుల విచారణకు హాజరు కాకుండా బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న రవిప్రకాశ్‌కు ఇక అన్నిదార్లు మూసుకుపోయాయని పోలీసుల ఎదుట లొంగిపోవడం మినహా రవిప్రకాశ్‌కు మరో దారి లేదని స్పష్టంగా తెలుస్తోంది.కాగా ఎంతోమంది కొమ్ములు తిరిగిన నేరస్థులను సైతం ఎక్కడ దాక్కున్నారో పసిగట్టే పోలీసులు రవిప్రకాశ్‌ ఆచూకీ మాత్రం ఇప్పటివరకు ఎందుకు కనిపెట్టలేకపోయారనే విమర్శలకు కూడా ఇప్పుడిప్పుడే సమాధానం లభిస్తోంది.అభియోగాలు వచ్చిన వెంటనే అరెస్ట్‌ చేస్తే విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో తమవైపు తప్పు లేకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే రవిప్రకాశ్‌కు చట్టబద్దంగా వీలైనన్ని అవకాశాలు ఇచ్చి అవన్నీ విఫలమయ్యాక అరెస్ట్‌ చేయాలనే ధోరణితో పోలీసులు వ్యవహరిస్తున్నారు.కేసులు నమోదైన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవిప్రకాశ్‌ మూడుసార్లు నోటీసులు జారీ చేసినా పోలీసులు ఎదుట విచారణకు హాజరుకాకుండా బెయిల్‌ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతుండడం ఇవన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుస్తుండడంతో సహజంగానే ప్రజల్లో కూడా రవిప్రకాశ్‌పై వ్యతిరేకత దృక్పథం నెలకొంది.మరోవైపు రవిప్రకాశ్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను హైకోర్టుతో పాటు తాజాగా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది.దీంతో పోలీసులు రవిప్రకాశ్‌కు చట్టబద్దంగా ఇచ్చిన అన్ని అవకాశాలు ముగియడంతో రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే రవి ప్రకాశ్‌ ఆచూకి కనిపెట్టిన పోలీసులు రేపోమాపో రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos