హోసూరు ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

హోసూరు ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

హోసూరు : హోసూరు, డెంకణీకోట సబ్ డివిజన్లలో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాయకోట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు చనిపోయారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలు తగిలి వారు మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, హెల్మెట్ ధరించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కృష్ణగిరి జిల్లా ఎస్పీ బండి గంగాధర్ అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా హోసూరు, డెంకణీకోట సబ్ డివిజన్లలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేసి, హెల్మెట్ ధరించని వారిపై కేసులు బనాయించారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని లేకుంటే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos