‘రాముడి’కి ఖాకీ కాపలా

‘రాముడి’కి ఖాకీ  కాపలా

లక్నో: ఉగ్రవాదులు అయోధ్య పై దాడి చేయవచ్చనే సమాచారం అందటంలో పట్టణంలో శని వారం పోలీసు పహరా, బందోబస్తు పెరిగింది.విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద రామ జన్మభూమి పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను ప్రత్యేకంగా మోహరించారు. ఆలయ పరిసరాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, హోటళ్లలో ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సాధారణ పౌరుల దుస్తుల్ని ధరించిన పోలీసులు, నిఘా వర్గాలు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని పోలీసు సూపరెంటెండెంట్ అనిల్‌ కుమార్‌ సిసోడియా తెలిపారు. శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే జూన్ 16 న తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో కలసి అయోధ్య పర్యటనకు రానున్నారు. అలాగే 2005 రామజన్మభూమి వివాద అంశం జూన్ 18న అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా భద్రతను మరింత పెంచినట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos