‘పీఎం నరేంద్ర మోదీ’ ఎదురు చుక్క

‘పీఎం నరేంద్ర మోదీ’ ఎదురు చుక్క

న్యూఢిల్లీ: ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమాను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం అత్యున్నత న్యాయ స్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.ఈ సినిమా ఓ రాజకీయ పార్టీకి ప్రయోజనకారిగా ఉందని అదులో నివేదించింది. ఎన్నికల ముందు ఎలాంటి బయోపిక్‌లను ప్రదర్శించడానికి వీల్లేదని ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీన్నిసినీ నిర్మాతలు అత్యున్నత న్యాయ స్థానంలో సవాలు చేసారు. ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని 24 లోపు తెలియ జేయాలని అత్యున్నత న్యాయ స్థానం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దరిమిలా సినిమాను వీక్షించిన ఎన్నికల సంఘం తన నివేదికను గత సోమవారం అందించింది. అత్యున్నత న్యాయ స్థానం దీని పై శుక్రవారం తుది తీర్పు ఇవ్వనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos