పిఎం కేర్స్ నిధి ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి బదిలీకి తిరస్కరణ

పిఎం కేర్స్ నిధి  ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి బదిలీకి తిరస్కరణ

న్యూ ఢిల్లీ : కరోనా నివారణ, బాధితుల ఉపశమనం కోసం పిఎం కేర్స్ ఫండ్ నగదును జాతీయ విపత్తు నిర్వహణ నిధి( ఎన్డిఆర్ఎఫ్)కి బదిలీ చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తులు అశోక్భూషణ్, ఆర్.సుభాష్ రెడ్డి, ఎంఆర్.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. తిరస్కరించింది. కరోనా నివారణకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం సరిపోతుందని తెలిపింది. పిఎం కేర్స్ ఫండ్ కింద సేకరించినవి ధార్మిక నిధులు, పూర్తిగా భిన్నమైనవని పేర్కొంది. స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్డిఆర్ఎఫ్కు సహకారం చేయ వచ్చని పేర్కొంది. పిఎం కేర్స్ విరాళాలను ఎన్డిఆర్ఎఫ్ నిధికి బదిలీ చేయాలని సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ సంస్థ వ్యాజ్యాన్ని దాఖలు దాఖలు చేసింది. మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది.

తాజా సమాచారం