ప్రధాని ఆత్మస్తుతి అసహ్యం

ప్రధాని ఆత్మస్తుతి అసహ్యం

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆత్మస్తుతి అసహ్యంగా ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం చేసిన ట్వీట్లో వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలు గడ్డి తింటున్నట్లుగా ఉన్న ఫొటోను దీనికి జత చేశారు.. లాక్డౌన్ సరిగ్గా అమలు కావడం లేదని.. కోవిడ్-19(కరోనా వైరస్)సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మస్తుతి అసహ్యంగా ఉందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఇందుకు చిన్న పిల్లలు గడ్డి తింటున్నట్లుగా ఉన్న ఫొటోను జత చేశారు.‘దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన ౩6 గంటల్లో కేంద్రం ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక పథకం ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ట్విటర్లో హర్షించినందకు ప్రశాంత్ కిషోర్ ఆ మేరకు స్పందించారు. లాక్డౌన్ వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్డౌన్ సరిగ్గా అమలు కావడం లేదని. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. ఇలాంటి దుస్థితిలో ఆత్మ స్తుతి అసహ్యమని పేర్కొన్నారు. బిహార్ ప్రభుత్వంపై నావిమర్శలు గుప్పించారు. జాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. రోజూవారీ కూలీలు, పేదల కోసం బిహార్ ప్రభుత్వం నిధిని కేటాయించాలంటూ గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos