కఠిన పిచ్ లపై పరీక్షించుకుంటున్నాం…రోహిత్

కఠిన పిచ్ లపై  పరీక్షించుకుంటున్నాం…రోహిత్

వెల్లింగ్టన్‌: ప్రపంచకప్‌ టోర్నీకి సన్నద్ధమవ్వడంలో భాగంగా కఠిన పిచ్‌లపై ఆడాలని భావించినట్టు టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు. అందుకే న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నానని తెలిపాడు. కివీస్‌పై 4-1తో సిరీస్‌ గెలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ‘టాస్‌కు ముందు పిచ్‌ను పరిశీలించా. అక్కడున్న తేమ తొలుత పేసర్లకు సహకరిస్తుందని ముందే తెలుసు. ప్రపంచకప్‌ మ్యాచుల్లో కఠిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటినెలా ఎదుర్కోవాలో ఇక్కడ చూడాలని భావించాం. నిజమే.. మేం త్వరగా నాలుగు వికెట్లు చేజార్చుకున్నాం. పరిస్థితులు బాగాలేనప్పుడు, బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు ఎలా బ్యాటింగ్‌ చేయాలో నేర్చుకోవడానికి ఇది ఉపయోపగడింది. ఇలా పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఆడాలో ఆటగాళ్లు ఇప్పుడు తెలుసుకున్నారు. 30 ఓవర్ల వరకు మా రన్‌రేట్‌ బాలేదు. అయినా 250 స్కోరు అందుకోవడం సానుకూల అంశం. సమతూకంతో, పటిష్ఠంగా ఉన్న కివీస్‌పై 4-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలవడం అద్భుతం. వచ్చిన రెండు అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైనా శుభ్‌మన్‌ గిల్‌ నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత్‌లో అందరూ రాణించారు’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos