నియమావళికి నీళ్లొదిలిన నిర్మల

నియమావళికి నీళ్లొదిలిన నిర్మల

తిరువనంతపురం : పలువురు కేంద్ర మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రధాన ఎన్నికల కమిషనర్కు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఫిర్యాదు చేశారు. కేరళ మౌలిక సదుపాయాలు పెట్టుబడుల నిధి బోర్డు(కెఐఐఎఫ్బి) ఉన్నతాధికారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేసు నమోదు చేసిన మరుసటి రోజు ఆయన ఫిర్యాదు చసారు. కెఐఐఎఫ్బి విదేశీ మారక నిర్వహణ చట్టం (పెమా) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కెఎం అబ్రహం, డిప్యూటీ మేనే జింగ్ డైరెక్టర్ విక్రమ్జిత్ సింగ్కు ఇడి తాఖీదుల్ని జారీ చేసింది. ‘ఈ కేసుకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యత వహించాలి. ఇటీవల జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె కెఐఐఎఫ్బికి వ్యతిరేకంగా ప్రసంగించినందుకు అధికారులకు నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల్లో ఎన్నికలు జరగనున్నందున ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఇడిని రంగంలోకి దించారని వార్తలు. కేంద్రం చర్యల కారణంగా అధికారులపై ప్రజా విశ్వాసం దెబ్బతింటుంది. దర్యాప్తు పేరుతో ఇడి అధికారులు ప్రవర్తించిన తీరుతో మహిళా ఉద్యోగులతో సహా కొంత మంది అధికారులు అసహనానికి గురయ్యా రు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను వినియోగించడం సరికాదు. స్వేచ్చాయుతంగా, న్యాయమైన ఎన్నికలను నిర్ధేశించడానికి ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చినా… నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ నిబంధనలను అనుసరించి రాజకీయాల్లో తటస్థ వైఖరితో వ్యవహరించాల’ని లేఖలో విపులీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos