తొలి టీకా వచ్చేసింది

తొలి టీకా వచ్చేసింది

లండన్: ఫైజర్ బయో ఎన్ టెక్ కరోనా టీకాను బ్రిటన్ అనుమతించింది. ప్రపంచంలో కెల్లా ఇదే తొలి టీకా. అనుమతించిన దేశం కూడా బ్రిటనే కావటం గమనార్హం. వచ్చే వారం ఇది ప్రజలకు అందుబాటులో రానుంది. దీనికి ఇండిపెండెంట్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చేసిన ప్రతిపాదనను ఆమోదించినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. తొలి విడత టీకా వితరణను సంబంధిత సమితి నిర్ధారించనుంది. తొలుత వృద్ధులకు ఇవ్వాలా? ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలా? అనే విషయంపై నిర్ణయిస్తుంది. ఈ టీకా 90 శాతం బాబాగా పని చేస్తోందని అమెరికాకు చెందిన బయోటెక్ ఫర్మ్ మోడెర్నా తన ప్రాథమిక నివేదికలో తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos