ఆరని పెట్రో మంట

ఆరని పెట్రో మంట

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా తొమ్మిదవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఆయా కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం పెట్రోల్ ధర లీటరుకు 26 పైసలు, డీజిల్ ధర లీటరుకు 26 పైసలు చొప్పున పెరిగింది. ఢిల్లీ, ముంబై తదితర మహానగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ఈరోజు 89.54 రూపాయలుగా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.96గా ఉంది. రాజస్థాన్లోని గంగానగర్లో పెట్రోల్ ధర అత్యధికంగా రూ. 100కు చేరుకుంది. ఈరోజు గంగానగర్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 100.13కు చేరుకుంది. దేశంలో కేవలం ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.34 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు రూ.2.57 చొప్పున పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos