మీరు మమ్మల్నిబ్యాన్ చేసేది ఏంటీ

  • In Film
  • February 23, 2019
  • 128 Views

గత వారం కశ్మీర్‌లోని పుల్వామలో జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ల
మధ్య రోజురోజుకు ఉద్రిక్తపరిస్థితులు పెరుగుతున్నాయి.ఇప్పటికే పాకిస్థాన్‌తో భారతప్రభుత్వం
వాణిజ్య సంబంధాలు,జలాల పంపిణీలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది.ఇరు దేశాల ప్రధానులు,సేనల
మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఈ తరుణంలో తమ చిత్రాల్లో పాకిస్థాన్‌ నటీనటులపై నిషేధించడంతో
పాటు తమ చిత్రాలను పాకిస్థాన్‌లో విడుదల చేయబోమంటూ బాలీవుడ్‌ హీరోలు,నిర్మాతలు ప్రకటించారు.తమకు
తమ దేశగౌరవం,ప్రజల మనోభావాలు,సైనికుల కంటే పాకిస్థాన్‌ నుంచి తమ చిత్రాలకు వచ్చే రెవెన్యూ
గొప్పదేమి కాదంటూ స్పష్టం చేసారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఇండియన్ సినిమాలను విడుదల కానివ్వొద్దు అంటూ లాహోర్ హైకోర్టు ను ఒక వ్యక్తి ఆశ్రయించాడు. భారత దేశంలో పాకిస్తాన్ కళాకారులను బహిష్కరించిన నేపథ్యంలో వారి సినిమాలను పాకిస్తాన్ లో ఎందుకు ప్రదర్శించాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశాడు. పాకిస్తాన్ టీవీ ఛానెల్స్ లో ఇండియన్ కంటెంట్ మరియు పాకిస్తాన్ లో ఇండియన్ ఛానెల్స్ ను బ్యాన్ చేయడంతో పాటు ఇండియన్ సినిమాలను బ్యాన్ చేయాలని ఆ వ్యక్తి కోరుతున్నాడు.అయితే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేయక ముందే పుల్వామా ఉగ్రదాడి జరిగిన రెండవ రోజే పలువురు హిందీ హీరోలు తమ సినిమాలను పాకిస్తాన్ లో విడుదల చేయబోం అంటూ ప్రకటించారు. మేమే మీ మార్కెట్ వద్దనుకుంటూ ఉంటే మీరు మమ్ముల్ని బ్యాన్ చేసేది ఏంటీ అంటూ కొందరు ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన వారు సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందిస్తున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos