రాజీవ్ హంతకుడి విడుదల

రాజీవ్  హంతకుడి విడుదల

న్యూఢిల్లీ :మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్ విడుదలకు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు మంత్రి వర్గం అంగీకరించినందున అధీకరణ 142 ప్రకారం పెరారివాలన్ విడుదల సమంజసమని అభిప్రాయపడింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య లో పెరరివలన్తో పాటు దోషులుగా తేలిన మురుగన్, అతని భార్య నళిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురి విడుదలకు గతంలో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పెరారివాలన్ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos