చిదంబరానికి నిరాశ

చిదంబరానికి నిరాశ

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో చుక్క ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన వినతి విచారణకు న్యాయస్థానం తిరస్కరించింది. చిదంబరం ఇది వరకే అరెస్టయినందున ఈ వినతి చెల్లదని స్పష్టీకరించింది. అరెస్టుకు ముందే తాము ముందస్తు బెయిల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసినందున విచారణ జరపాలని చిదంబరం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీన్ని ధర్మాసనం ఆక్షేపించింది. చిదంబరం అరెస్టైనందున ఇప్పుడు ఆ వినతికి విలువ లేదని పేర్కొంది.సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ చిదంబరం మరో వ్యాజ్యాన్ని కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన సీబీఐ ఆధీనంలో ఉన్నందున ఆ వ్యవహారంపై జోక్యం చేసుకోబోమని గత వారం న్యాయస్థానం స్పష్టం చేసింది. నేటితో ఆయన కస్టడీ ముగియ నుంది. దీంతో అరెస్టు తర్వాత దాఖలు చేసిన ఈ విచారణల పట్టి కలో నమోదు ధర్మాసనం వెల్లడించింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos