‘చెప్పలేను, స్పష్టంగా తెలీదు’

‘చెప్పలేను, స్పష్టంగా తెలీదు’

న్యూ ఢిల్లీ: ‘చెప్పలేను, స్పష్టంగా తెలీదు’ అని మాత్రమే సిబిఐ అధికార్లు అడిగిన ఇరవై ప్రశ్నలకు ఇచ్చిన ముక్తసరి సమాధానాలివి. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో బుధవారం రాత్రి అరెస్టయిన చిదంబరాన్ని రాత్రి 12 గంటల వేళలో విచారణ ప్రారంభించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు రెండో విడత ప్రశ్నించారు. తొలి విడత ప్రశ్నావళికి ముందు భోజనం చేయాలని సీబీఐ అధికారులు చేసిన సూచనను తిరస్కరించారు. తర్వాత విచారణ ప్రారంభించారు. సుమారు 20 కీలక ప్రశ్నలేసారు. ఇంద్రాణీ ముఖర్జియాతో సమావేశం, ఇతర అంశాలపై ప్రశ్నించారు. రెండో దఫా విచారణ ఉదయాన్నే 8గంటల సమయంలో మొదలైంది. దాదాపు ప్రశ్నలన్నింటికీ చిదంబరం ‘చెప్పలేను’, ‘స్పష్టంగా తెలీదు’ అనే సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos