చిదంబరంపై అభియోగ పత్రం

చిదంబరంపై అభియోగ పత్రం

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ శుక్రవారం ఇక్కడి ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన అభియోగ పత్రంలో సిబిఐ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పేరునూ చేర్చింది. మొత్తం 14 మంది పేర్లను అందులో పేర్కొంది. దీనిపై ఈ నెల 21న కోర్టు విచారణ చేపట్టనుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. అప్పట్నించి ఆయన తీహార్ జైలులో బంధీగా ఉన్నారు. జ్యుడిషియల్ కస్ట డీలోని నిందితులకు వ్యతిరేకంగా రెండు నెలల్లోగా అభియోగ పత్రాన్ని దాఖలు చేయక పోతే వారు బెయిలు పొంద వచ్చు. కేసు కీలక దశలో చేరి నందున చిందంబరానికి బెయిల్ మంజూరు చేయరాదని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. దరిమిలా చిదంబరాన్ని చెరసాల్లోనే ప్రశ్నించిన ఈడీ ఆయనను తమ కస్టడీలోకి తీసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos