చిదంబరానికి విముక్తి

చిదంబరానికి విముక్తి

న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, నగదు అక్రమ బదిలీ కేసులో నిందితుడుగా తీహార్ చెరసాల్లో గత105 రోజులుగా మగ్గిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఎట్టలకేలకు బుధవారం విముక్తి లభించింది. అత్యున్నత న్యాయస్థానం ఆయనకు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాల్ని ప్రభావితం చేసే చర్యలకు పాల్పడరాదని, మాధ్యమ సంస్థ లకు ముఖా ముఖిలు, బహిరంగ ప్రకటనలు చేయరాదని,అనుమతి లేకుండా విదేశాలకు ఆదేశించింది. బెయిల్ మంజూరుకు రూ.రెండు లక్షలు, ఇద్దరు వ్యక్తుల పూచీ కత్తు తీసుకుంది. జస్టిస్ ఆర్ భానుమతి, ఏఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్లతో కూడిన ధర్మాసనం తీర్పుని వెలువ రించింది. ఆగస్టు 21న ఆయన్ని సీబీఐ అనేక నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసు కుం ది. ఇప్పటికే ఇదే విషయమై సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ లభించింది. తాజాగా ఈడీ కేసు లోనూ ఊరట లభించ డం తో చెరసాల నుంచి విడుదలయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos