పవన్‌ వర్మా.. పార్టీని వదలి వెళ్ళు

పట్నా: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోనూ భాజపాతో జేడీయూ పొత్తు కుదుర్చుకోవటం ఇష్టం లేకపోతే పార్టీని వదలి వెళ్లాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటుగా ‘హితవు’ చెప్పారు. పొత్తు గురించి పవన్ వర్మ బహిరంగ లేఖ రాసినందుకు నితీశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పవన్ తన అసంతృప్తిని వ్యక్తం చేసే మార్గం ఇది కాదన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే దాని గురించి పార్టీ సమావేశాల్లో మాట్లాడాలి. అంతే కానీ, ఇలా బహిరంగంగా మాట్లా డ కూడదు. ఆయన ఇలా ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన కావాలంటే పార్టీ నుంచి వెళ్లిపోయి తనకు నచ్చిన మరో పార్టీలో చేరవచ్చు. అది అతని నిర్ణయం. అతనికి నా ఆశీర్వాదం ఉంటుంది’ అని నితీశ్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్ని కల్లో జేడీయూ భాజపాతో ఎందుకు కలిసి పోటీ చేస్తోందని రెండు రోజుల కిందట ట్విటర్లో ప్రశ్నించారు. ‘ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్ కావాలంటూ మీరే చాలా సార్లు ప్రకటించారు. మరి అలాంటిది భాజపాతో ఎందుకు చేతులు కలిపారు. ఎన్ఆర్సీ, సీఏఏకి వ్యతి రేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే భాజపాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నార’ని నితీశ్ను ప్రశ్నించారు. భాజపాతో కల వడం తనను కలవర పెడుతోందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos