బీజేపీ టికెట్ ను నిరాకరించిన భోజ్ పురి స్టార్

బీజేపీ టికెట్ ను నిరాకరించిన భోజ్ పురి స్టార్

కోల్కతా : లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. బీజేపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ కూడా నెలకొంది. టికెట్ కోసం ఎంతో మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ టికెట్ ను ఓ అభ్యర్థి తిరస్కరించారు. తనను క్షమించాలని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. ఆయన మరెవరో కాడు ప్రముఖ భోజ్ పురి హీరో పవన్ సింగ్. బీజేపీ తన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ నియోజక వర్గం టికెట్ ను పవన్ కు బీజేపీ హై కమాండ్ కేటాయించింది. అయితే టికెట్ ను వపన్ తిరస్కరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని కారణాల వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని పవన్ సింగ్ తెలిపారు. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపు తున్నానని చెప్పారు. పవన్ సింగ్ ది బీహార్ లోని అర్రా. భోజ్ పురి సినీ పరిశ్రమలో అగ్ర నటుల్లో ఒకరిగా ఆయన కొనసాగు తున్నారు. అభిమానులు ఆయనను పవర్ స్టార్ అని పిలుచు కుంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos