చిత్రపురిలో అందరికీ ఇళ్ళు

చిత్రపురిలో అందరికీ ఇళ్ళు

హైదరాబాద్ : అందరికీ వినోదాన్ని పంచే సినిమా నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు సాగిస్తానని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. చిత్రపురిలో ఇంటి అవకాశం దక్కని పలువురు బుధవారం పార్టీ కార్యాలయంలో చిత్రపురి సాధన సమితి పేరిట ఆయనను కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. జూనియర్ ఆర్టిస్టులు, కాస్ట్యూమర్లు, ఫైటర్లు లాంటి సినీ రంగంలో 24 విభాగాల్లో పని చేస్తున్న వారు తమకు ఇళ్ళు దక్కడం లేదని, చిత్ర సీమతో సంబంధం లేని వారికి ప్లాట్లు దక్కించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారికి పని లేకుండా చేస్తున్నారని వాపోయారు. దీనిపై ఎన్. శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావులతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos