పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలనకు సోషలిజం ఒక్కటే మార్గం

పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలనకు సోషలిజం ఒక్కటే మార్గం

అమరావతి : ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించాలంటే సోషలిజం ఒక్కటే మార్గమని ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్ ప్రభాత్పట్నాయక్, ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాఫెసర్ ప్రభాత్పట్నాయక్ ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, రైతు ఉద్యమంపై రాసిన వ్యాసాలపై ప్రజాశక్తి బుకహేౌస్ ‘మోడీ వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకించాలి ? పతనం అంచున భారత ఆర్థిక వ్యవస్థ, సంక్షోభంలో పెట్టుబడిదారి వ్యవస్థ’ అనే 3 పుస్తకాలను ఆవిష్క రించారు. ‘ ప్రపంచాన్ని నేడు ద్రవ్యపెట్టుబడి శాసిస్తోందని అన్నారు. లాభాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోయే ద్రవ్య పెట్టుబడిదారి విధానంపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలి పోతున్నాయి. ద్రవ్యపెట్టుబడిదారులు ప్రపంచాన్ని శాసిస్తున్నార’ని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ‘గత మూడు దశాబ్దాలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాల్లో అమలు చేసిన నయా ఉదారవాద విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. పర్యవసానంగా ప్రజలపై నిరుద్యోగం, వేతనాలకోతలు, ధరల పెరుగుదల తదితర రూపాల్లో పెనుభారాలు పడుతున్నాయి. ప్రజల్లో తలెత్తే అసంతృప్తిని, వ్యతిరేకతను పక్కదోవపట్టించడానికి, అణచి వేయడానికి ప్రపంచంలో పలు దేశాల్లో నయా ఫాసిస్టు శక్తులు ముందు కొస్తున్నాయి. వాటిని ఓడించి ప్రత్యామ్నాయ విధానాలు ఎజెండాను రూపొందించి అమలు చేయడానికి, శ్రామిక ప్రజలందరినీ కదిలించి వామపక్ష ప్రజాతంత్రశక్తులు కృషి చేయాలి. మోడీ వ్యవసాయ చట్టాలు దేశ ఆహారభద్రతను దెబ్బతీస్తాయి. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల పట్టు మన దేశీ య వ్యవసాయంపై బిగుసుకుంటే కార్మిక, కర్షక జనావళికి అత్యంత నష్టదాయకంగా మారుతుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను, వ్యాపా రాలను పరిరక్షించడం, వారం ద రినీ కార్మిక, కర్షక సమైక్య ఉద్యమాలలో భాగస్వాముల్ని చేయడం ప్రజాతంత్ర ఉద్యమంలో కీలకం’ అని ప్రభాత్పట్నాయక్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos