పనికి రాని పతంజలి నూనె

పనికి రాని పతంజలి నూనె

జైపూర్ : రాందేవ్ బాబా సంస్థ- పతంజలి విక్రయిస్తున్న ఆవాల నూనె నాణ్యత లేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ నూనెను అల్వార్ నగరంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లాబోరేటరీలో పరీక్షించినపుడు ఈ విషయం తేలింది. . సింఘానియా ఆయిల్ మిల్లు నుంచి పతంజలికి సరఫరా చేసిన ఆవ నూనె యొక్క ఐదు నమూనాలను పరీక్షించారు. అవన్నీ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆవనూనె ఆహార భద్రతపై స్థానిక పరిపాలన అధికారి సమక్షంలో పరీక్షించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓంప్రకాష్ మీనా చెప్పారు. ఇంకా శ్రీశ్రీ తత్వ బ్రాండ్ ఆవాల నూనె కూడా నాణ్యత లేనిదిగా తేలింది. అధికారులు సింఘానియా ఆయిల్ మిల్లు నుంచి పెద్ద మొత్తంలో పతంజలి ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాక మిల్లును మూసివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos