పొరుగు సేవలకు పోలీసు పనులు

పొరుగు సేవలకు పోలీసు పనులు

న్యూ ఢిల్లీ: దాఖలాల నిర్వహణ, పాస్ పోర్టుల తనిఖీ వంటి దాదాపు పాతిక పనులకు పొరుగు సేవల్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వినియోగించుకోదలు స్తోంది. పోలీసులు తమ ప్రాథమిక కర్తవ్యాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, పోలీసు డైరెక్టర్జనరల్ అభిప్రాయాలను కోరింది. తపాలా బట్వాడా, తాఖీదుల పంపిణీ, పాస్పోర్టుల తనిఖీ, సీసీటీవీ కంట్రోల్ రూం పర్యవేక్షణ, డ్రైవింగ్,వంట, దుస్తులు ఉతకడం, పాఠశాలలు – కళాశాలలకు భద్రత కల్పించడం వంటివి కేంద్రం గుర్తించిన 25 పోలీసింగ్ ఇతర విధుల్లో ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. ఈ పనుల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే యోచన సరికాదని కొందరు నిపుణులు హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos