అన్నగారికి నెల్లూరులో గెస్ట్‌హౌజ్‌లో అవమానం..

అన్నగారికి నెల్లూరులో గెస్ట్‌హౌజ్‌లో అవమానం..

పరుచూరి పలుకులు పేరుతో ఇప్పటి వరకు తమ సినీ ప్రస్థానంలో తమకు ఎదురైన ఘటనలు,అనుభవాలు తాము చూసిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆ సంఘటలను ఈ తరం ప్రేక్షకులకు తెలియజేస్తున్న సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు.మహాసంగ్రామం కథ చెబుతున్న సమయంలో ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.దీంతో ఎందుకు అన్నగారు రాజకీయాల్లోకి వెళ్లడం.ప్రజలు మిమ్మల్ని రాముడిగా,కృష్ణుడిగా చూస్తున్నారు.అటువంటిది రాజకీయాల్లోకి వెళితే సగం మంది శత్రువులు తయారవుతారని ఎన్టీఆర్‌తో చెప్పామన్నారు.నా కోసం ఇంత చేసిన ప్రజలకు ఏదైనా చేయాలి బ్రదర్‌ అంటూ ఎన్టీఆర్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు.రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించాక ఓసారి ఎన్టీఆర్‌తో పాటు నెల్లూరుకు వెళ్లగా నెల్లూరులో జరిగిన ఓ అవమానకర ఘటన గురించి ప్రస్తావించారు.అన్నగారు నెల్లూరు అథిధిగృహంలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అక్కడికి మంత్రి వచ్చారు.దీంతో సిబ్బంది అన్నగారి దగ్గరికి వచ్చి వెంటనే అథిధి గృహం ఖాళీ చేయాలంటూ సూచించారు.మూడు గంటలు ఆగితే తెల్లవారుతుంది నేను వెళ్లిపోతానని చెప్పినా వినకుండా ఖాళీ చేయాల్సిందేనని సిబ్బంది చెప్పారు.మీరు ఎన్టీఆర్‌ కావచ్చు కానీ ఆయన మంత్రి వెంటనే ఖాళీ చేయాల్సిందేనని సిబ్బంది చెప్పారు.ఆ సమయంలో వర్షం కూడా పడుతోంది.అప్పుడు అథిధి గృహం నుంచి వెళ్లిపోతూ అన్నగారు ఒకమాట అన్నారు.‘వస్తాను..ఇదే అథిధిగృహానికి వస్తాను..నటుడిగానో మరో రకంగానో కాదు..ముఖ్యమంత్రి రామారావుగా వస్తాను’ అంటూ ఎన్టీఆర్‌ అక్కడి నుంచి నిష్కృమించారు.ఇది జరిగిన కొద్ది కాలానికే అన్నట్లుగా ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌ అదే గెస్ట్‌హౌస్‌కు వెళ్లారని పరచూరి గుర్తు చేసుకున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos